నాగేంద్ర ట్రేడ్ కంపెనీకి సహకరిస్తుందెవరు….?

ఏనుమాముల మార్కెట్ లో అసలేం జరుగుతుంది? అధికారుల నిర్లక్ష్యం అడితి దారుల పాలిట శాపంగా మారుతుందా…? రైతులకు కోట్లల్లో డబ్బులు ఎగ్గొట్టిన ఆ కంపెనీ పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు.కనీసం ఆ కంపెనీ బాద్యులతో మాట్లాడి రైతులకు రావాల్సిన బకాయిలు ఇప్పించడానికి మార్కెట్ అధికారులు ఎందుకు ముందుకు రావడం లేదు…ఇలాంటి చిక్కు ముడులు,అనేక ప్రశ్నలు ఇప్పుడు రైతులకు మార్కెట్ అధికారులపై, ప్రజాప్రతినిధులపై అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి.

నాగేంద్ర ట్రేడ్ కంపెనీకి సహకరిస్తుందెవరు....?- news10.app

నాగేంద్ర ట్రేడింగ్ కంపెనీ యాజమాన్యం అడితి దారులకు చెల్లించాల్సిన 10 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన విషయం తెలిసిందే. ఈ విషయంలో గత కొన్ని రోజులుగా రైతులు ధర్నాలు చేస్తున్నారు… కొనుగోళ్ళను నిలిపి వేసి ఆందోళన చేస్తున్నారు. అయిన ట్రేడింగ్ కంపెనీ కానీ అధికారులు,ప్రజాప్రతినిధులు కానీ తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.ఇలా తమకేం పట్టనట్లు వ్యవహరించడానికి కారణం నాగేంద్ర ట్రేడింగ్ కంపెనీ యాజమాన్యానికి, మార్కెట్ అధికారులు ,రాజకీయ నాయకులు సహకరిస్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. రైతులకు డబ్బులు ఎగ్గొట్టి ముప్పుతిప్పలు పెడుతున్న ఈ ట్రేడింగ్ కంపెనీ ఏనుమాముల మార్కెట్ లో రైతుల వద్ద నుంచి సరుకు తిరిగి ఖరీదు చేయాలంటే లైసెన్స్ తప్పనిసరి.

మరి సదరు యాజమాన్యానికి సంబంధించిన లైసెన్స్ రెన్యూవల్ అయిందా..? అయితే ఏ ప్రాతిపదికన రెన్యూవల్ చేశారు ?ష్యురిటీగా ఏం పెట్టారు… అనేది అధికారులకే తెలియాలి. నాగేంద్ర ట్రేడింగ్ కంపెనీ మరీ ఇంతగా రైతులను మోసం చేసిన అధికారులు ఎందుకు గ్రహించలేకపోతున్నారు…? గతం లో కూడా ఖరీదు దారులు ఇలాగే చేసిన ఘటనలు ఉన్న ఎందుకు అధికారులు నిర్లక్ష్యంగా లైసెన్స్ లు రెన్యువల్ చేస్తున్నారు…? వారికే తెలియాలి. ఇప్పటికయినా వ్యాపారస్తులకు న్యాయం చేసే భాద్యత అధికారులు తీసుకుని వారికి డబ్బులు చెల్లించేవిధంగా చర్యలు తీసుకోవాలని వ్యాపారస్తులు కోరుతున్నారు.ఇది ఇలా ఉంటే నాగేంద్ర ట్రేడింగ్ కంపెనీ యాజమాన్యాన్ని మార్కెట్ అధికారులతో పాటు ఓ రాజకీయ నాయకుడు కాపాడుతున్నట్లు వ్యాపారులు బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు…విరివల్లే ట్రేడింగ్ కంపెనీ చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకుండా గమ్మున ఉంటుందని వారు ఆరోపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here