వెల్లువలా చిట్స్ భాదితులు..

ప్రజాసేన ప్రజాదర్బార్ కు భారీ స్పందన

హన్మకొండలో ఆదివారం ప్రజాసేన అవినీతి నిరోధక సంస్థ ప్రజాదర్బార్ కు విశేష స్పందన లభించింది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో చిట్ ఫండ్స్ మోసాలపై నిర్వహించిన ఈ ప్రజాదర్బార్ కు వందల సంఖ్యలో భాదితులు హాజరయి పిర్యాదు చేసారు.

వెల్లువలా చిట్స్ భాదితులు..- news10.app

ప్రధానంగా ఐదు చిట్ ఫండ్స్ పై అధిక సంఖ్యలో భాదితుల ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పుప్పాల రజనీకాంత్ మాట్లాడుతూ ఈ వారం మొత్తం భాదితులు 9133179776 కి ఫోన్ చేసి ఫిర్యాదులు చేయవచ్చని, ఇందులో చిట్ రిజిస్ట్రార్ ల పాత్ర స్పష్టంగా కనబడుతుందని, భాదితులకు న్యాయం జరిగే వరకు ప్రజాసేన పోరాటం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ లీగల్ అడ్వెజర్ డాక్టర్ మార్త శ్రీనివాస్, కార్యదర్శి అమరేందర్ రెడ్డి, ప్రజాసేన నాయకులు శ్రీనివాస్,పిట్టల సంపత్, నాగుల చిరు ప్రసాద్, రాసూరి రాజేష్,ముదాసిర్,విమల్ రాజ్, రాజేష్, సతీష్ లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here