కూల్చివేయండి…. ఆ ఆసుపత్రికి నోటీసులు జారీ

హన్మకొండ నగరం నడిబొడ్డులో అక్రమంగా అనుమతులు లేకుండా అదనపు అంతస్తులు నిర్మించిన నరేశ్ ఆర్థరైటిస్ రుమాటాలజి ఆసుపత్రి వ్యవహారంపై మున్సిపల్ అధికారులు సీరియస్ ఐయారు… గత నాలుగు రోజులుగా ఈ ఆసుపత్రి అక్రమ వ్యవహారంపై న్యూస్10 వరుస కథనాలను వెలువరించగా మున్సిపల్ అధికారులు ఆ ఆసుపత్రి యాజమాన్యానికి సోమవారం నోటీసులు అందజేశారు.

కూల్చివేయండి.... ఆ ఆసుపత్రికి నోటీసులు జారీ- news10.app

ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ అంతస్తులను ఒక్కరోజులో కూల్చివేయాలని లేదంటే తామే కూల్చివేయాల్సి వస్తుందని ఆ నోటీసులో అధికారులు పేర్కొన్నారు. తాము నిర్మాణాన్ని కూల్చివేస్తే కూల్చివేతకు ఐయిన ఖర్చులను సైతం ఆసుపత్రి యాజమాన్యమే భరించాల్సి ఉంటుందని నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. కాగా మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ జారీ చేసిన ఈ నోటీసులను అందుకున్న ఆసుపత్రి యాజమాన్యం అనుమతి లేకుండా నిర్మించిన అంతస్తులను కూల్చివేస్తార… లేదా వేచిచూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here