సర్కారీ పంతులు….రియల్టర్ అవతారం ?

కోట్లకు పడగలెత్తిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు

ఆయనో సర్కారీ పంతులు… సర్కారీ పంతులు అంటే ఉదయం కాగానే బడికి వెళ్లి పాఠాలు చెప్పి సాయంత్రం కాగానే ఇంటికి వచ్చే బాపతు పంతులు కాదు.నిత్యం బడికి డుమ్మాలు కొడుతూ పేరుకే సర్కారీ పంతులు నౌకరి చేస్తూ ఉపాధ్యాయ వృత్తిని పక్కనపెట్టి నామ్ కే వాస్తే నౌకరిలో ఉంటూ రియలేస్టేట్ దందాను వృత్తిగా మార్చుకున్న పంతులు ఆయన.నెలలో ఒకటి రెండు సార్లు కూడా పాఠశాలకు వెళ్లకుండా కనీసం పాఠశాల మొహం చుట్టపుచూపుగా కూడా చూడకుండా తనకున్న రాజకీయ పలుకుబడితో ఉద్యోగాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా నెట్టుకువస్తున్న ఘనుడు ఈ సర్కారీ పంతులని విమర్శలు బాగానే వినపడుతున్నాయి.

సర్కారీ పంతులు....రియల్టర్ అవతారం ?- news10.app

వరంగల్ నగర శివారులోని ఓ మండలం లోని పాఠశాలలో ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్న ఈ పంతులు ఆస్తుల గూర్చి చెపితే ఎవరైనా ఆశ్చర్య పోకమానరట…సర్కారీ పంతులు కు ఇన్ని ఆస్తులు ఎలా మీరు తప్పులో కాలేశారు అంటారట.కానీ నిజానికి ఇదే నిజమట బడికి ఏమాత్రం వెళ్లకుండా రియలేస్టేట్ రంగంలో తిరుగుతూ ఈ పంతులు కోట్ల రూపాయలకు పడగలెత్తాడని సమాచారం. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఓ నియోజకవర్గం ఎమ్మెల్యే తన తర్వాతి స్థానాన్ని ఆ నియజకవర్గంలో ఈ సర్కారీ పంతులుకే కట్టబెట్టాడంటే ఆ సారు రేంజ్ ఏంటో అర్థం చేసుకోవాలని పలువురు అంటున్నారు.వరంగల్ త్రినగరిలో ,నగర శివారులో పదుల సంఖ్యలో అసైన్డ్ భూముల్లో సైతం వెంచర్ లు చేసిన ఇతగాడు ఆస్తుల్లో కోట్లల్లో ఎప్పుడో శతకం దాటిపోయాడని ఎమ్మెల్యే నుచరులే బాహటంగా అంటున్నారు.ఇటీవలే మడికొండలో రెండు వెంచర్లు, పంథిని లో ఒకటి, బట్టుపల్లిలో రెండు, ఎన్ ఐ టి దగ్గర ఒకటి, ముచ్చర్ల నాగారం వద్ద ఒకటి వెంచర్ లు వేసి బాగానే వెనకేసినట్లు తెలిసింది.కాగా కొన్ని వెంచర్ లల్లో ఓ ప్రముఖ ఆసుపత్రి యజమాని,ఓ కార్పొరేట్ పాఠశాల యజమాని,ఓ ప్రముఖ వ్యాపారి ఈ సర్కారీ పంతులుతో జతకలిసినట్లు తెలిసింది.

ఆ ఎమ్మెల్యే కు బినామీనా….?

మరో వైపు ఈ సర్కారీ పంతులు వరంగల్ నగర శివారు నియోజకవర్గం ఎమ్మెల్యే కు బినామీ అని నియోజకవర్గం లో జోరుగా ప్రచారం జరుగుతోంది. బడి మొహం ఏమాత్రం చూడని ఈ పంతులు నిత్యం ఈ ఎమ్మెల్యే తోనే తిరుగుతూ కనిపిస్తాడట.నియోజకవర్గంలోని అధికారుల పోస్టింగ్ లు ఇతర వ్యవహారాలన్నీ ఇతగాడే చూసుకుంటాడని టాక్ నడుస్తోంది… ఇతని దృష్టికి ఏ విషయాన్ని తీసుకువెళ్లిన ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినట్లేనని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. కాంట్రాక్టర్ లకు బిల్లులు ఇప్పించే పనితో సహా అన్ని పనులు ఈ సర్కారీ పంతులే చక్కబెడుతుంటే ఇతడు ఆ ఎమ్మెల్యే కు బినామినేనని అందరూ చర్చించుకుంటున్నారు.

ఐటి దృష్టి సారించాలి….

నిత్యం పాఠశాలకు ఎగనామం పెడుతూ అసలు బడి వైపే కన్నెత్తి చూడని ఈ సర్కారీ పంతులు ఆస్తులపై ఐ టి అధికారులు ఓ కన్నెయాలని కొందరు అంటున్నారు.ఆరు సంవత్సరాల క్రితం ఓ సాధారణ ఉద్యోగిగానే ఉన్న ఇతగాడు ఒక్కసారిగా కోట్ల రూపాయలకు అధిపతి ఎలా ఐయాడో దృష్టి సారించాలని కోరుతున్నారు. విద్యా శాఖ అధికారులు సైతం ఈ డుమ్మాల పంతులుపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా అ ధికారులు ఆ దిశగా దృష్టి సారించాలని పాఠశాలకు నిత్యం ఎగనామం పెడుతున్న పంతులు పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here