ఆ సిఐ పైరవీలు షురూ….?

ఆ సిఐ ఎక్కడున్నా తనకున్న రాజకీయ పలుకుబడి, పరిచయాలు బాగానే వాడేస్తుంటాడట… ఎప్పటినుంచో ఓ మంచి పోస్టింగ్ కోసం ఎదురుచూసిన ఆయన త్రినగరి లోని ఓ పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్ కూడా సంపాదించాడు. కానీ అతడి ప్రవర్తన కారణంగా ఉన్నతాధికారులు ఏకంగా సస్పెండ్ చేశారు. మొన్నటి వరకు ఎక్కడ పోస్టింగ్ లేకున్నా ఉమ్మడి జిల్లా వదిలి కొద్దిరోజులు వేరే జిల్లాలో విధులు నిర్వహించిన ఆ సిఐ సారు ప్రస్తుతం హన్మకొండ నగరంలోని ఓ పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ కోసం తెగ పైరవీలు చేస్తున్నాడట. ఈ పోలీస్ స్టేషన్ లో సిఐ పోస్ట్ ఇంకా ఖాళీ కాకముందే తనకున్న రాజకీయ పలుకుబడి ద్వారా అదే స్టేషన్ కావాలి తెగ పట్టుబడుతున్నాడట…. తనకు పరిచయం ఉన్న ప్రజాప్రతినిధుల ద్వారా పోలీస్ ఉన్నతాధికారులకు సిపార్స్ చేయిస్తున్నాడట.

ఆ సిఐ పైరవీలు షురూ....?- news10.app

ఇదంతా బాగానే ఉన్నా ఆ పోలీస్ స్టేషన్ పోస్టింగ్ కోసం ఆ సిఐ తెగ పైరవీలు చేస్తున్న పోలీస్ బాస్ ఆ పోస్టింగ్ ఇచ్చేదే లేదని ససేమిరా అనడంతో ఎలాగైనా ఆ పోస్టింగ్ సంపాదించాలని తాను పట్టువదలని విక్రమార్కుడిలా ఇంకా తనప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నాడట. రాజకీయంగా కాసింత ఉన్నతస్థాయిలో పోలీస్ బాస్ కు సిపార్స్ చేయించుకుంటే ఒకవేళ ఆ పోస్ట్ ఆ సిఐ కే దక్కుతుందేమోనని పోలీస్ సర్కిల్స్ లో సైతం అప్పుడే గుసగుసలు మొదలయినట్లు తెలిసింది. గతంలో కూడా ఈ పోలీస్ స్టేషన్ సిఐ పోస్టింగ్ కోసం చాలా మంది సిఐ లు పోటాపోటీగా ప్రయత్నాలు కొనసాగించారు. ఎవరికి తోచిన స్థాయిలో వారు ఈ పోస్టింగ్ దక్కించుకునేందుకు పైరవీలు సైతం చేశారు. ఇప్పుడు ఈ పోస్టింగ్ కోసం ఇంతలా ఆ సిఐ ప్రయత్నం చేయడం.. తనకు ఉన్న రాజకీయ పలుకుబడిని పోస్టింగ్ కోసం ఉపయోగిస్తుండడం మళ్ళీ హన్మకొండ పరిధిలోనే సిఐ గా పోస్టింగ్ తెచ్చుకోవాలని చూడడం ఆ సిఐ సారు కోరుకుంటున్న పోలీస్ స్టేషన్లో సైతం అప్పుడే చర్చ మొదలయినట్లు సమాచారం. ఇంతకు ఆ పోస్టింగ్ కోసం ఇంతలా ప్రయత్నం చేస్తున్న ఆ సిఐ పైరవీ ఫలిస్తుందా లేదా చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here