వ్యవసాయ భూమే రియల్ వెంచర్

వరంగల్ నగర శివారులోని వ్యవసాభూములన్ని రియల్ వెంచర్ లుగా మారుతున్నాయి. ఎలాంటి నిబంధనలు పాటించకుండా కొందరు రియల్టర్లు భూములు కొనుగోలు చేసి తమకు తోచినట్లుగా వెంచర్ లు చేసి… రిజిస్ట్రేషన్ ఇతర ఇబ్బందులు రాకుండా గజాల్లో కాకుండా గుంటల చొప్పున ప్రజలకు భూమిని అమ్ముతూ వ్యాపారం కొనసాగిస్తున్నారు.ఈ వెంచర్ విషయంలో సైతం సరిగ్గా అలాగే జరిగింది.

వ్యవసాయ భూమే రియల్ వెంచర్- news10.app

నిబంధనలను పూర్తిగా గాలికి వదిలేశారు, వ్యవసాయ భూమిని నాల కన్వర్షన్ చేయడం మరిచారు, కుడా అనుమతితో మాకేం పని అన్నట్లుగా సంపాదనే ప్రధాన లక్ష్యంగా చేసుకొని తూతుమంత్రంగా ఓ వెంచర్ చేసి అమ్మకాలు సైతం ప్రారంభించారట రియల్టర్ లు. ఈ అక్రమ వెంచర్ కు అధికారులు సైతం సహకరిస్తున్నట్లు ప్రచారం జోరుగానే జరుగుతుంది వివరాల్లోకి వెలితే వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని నర్సంపేట ప్రధాన రహదారి పక్కనే ఉన్న సింగ్యా తండాలో కొంతమంది రియల్టర్ లు ఓ 2 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలుచేసి ఆ భూమిని నాల కన్వర్షన్ చెయ్యకుండానే 25 ఫ్లాట్లు చేసి అమ్మకాలు ప్రారంభించారని సమాచారం. వ్యవసాయభూమిని కొనుగోలు చేసిన వీరు కుడా పరిధిలో ఉండి కుడా అనుమతులు తీసుకోకుండా వెంచర్ చేసినట్లు తెలిసింది.

ఆ వెంచర్ లో కనీస సౌకర్యాలు అయినటువంటి రోడ్లు, తాగునీటి సౌకర్యం, డ్రైనేజి వ్యవస్థ, ప్రహారీ లేకుండానే సంపాదనే ధ్యేయంగా రియల్టర్లు వెంచర్ నిర్ నిర్వహిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి… ఈ అనధికార వెంచర్ చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని స్థానికులు అంటున్నారు.. ఇంతటి బహిరంగంగా అక్రమ వెంచర్ కనపడుతుంటే రెవెన్యూ అధికారులు, కుడా అధికారులు చర్యలు తీసుకోకపోవడం సైతం పలు అనుమానాలకు తావిస్తోందని వారు అంటున్నారు.సింగ్యా తండా లో రియల్టర్ లు చేసిన వెంచర్ కు నాల కన్వర్షన్ చేయలేదు .కుడా పరిధిలో వెంచర్ చేయాలంటే కుడా పర్మిషన్ తప్పనిసరి కానీ ఆ వెంచర్ యాజమాన్యం ఎలాంటి అనుమతులు పొందకుండానే ఇష్టారాజ్యంగా వెంచర్ ఏర్పాటు చేసిన అధికారులు ఎందుకు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆ తండా వాసులు కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా ఈ వెంచర్ పై చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here