ఆ సిఐ పై ఇంటెలిజెన్స్ ఆరా…?

గతంలో నగరంలో సిఐ గా బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం వేరే జిల్లాలో వి ఆర్ లో ఉన్న ఓ సిఐ తిరిగి నగరానికి రావడానికి చేస్తున్న ప్రయత్నాలపై న్యూస్10 సోమవారం సంచికలో వెలువరించిన “ఆ సిఐ పైరవీ షురూ…?” అనే కథనంపై ఇంటెలిజెన్స్ ఆరా తీసినట్లు సమాచారం. ఆ సిఐ కొనసాగిస్తున్న ప్రయత్నాలు, గతంలో హన్మకొండ నగరంలోని ఓ పోలీస్ స్టేషన్లో పనిచేసినపుడు సిఐ వ్యవహార శైలి తదితర అంశాలపై ఇంటలిజెన్స్ వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఆ సిఐ గురించి అన్ని వివరాలు సేకరించిన ఇంటలిజెన్స్ రెండు రోజుల్లో వరంగల్ పోలీస్ కమిషనర్ కు ఓ నివేదిక సమర్పించనున్నట్లు సమాచారం.

ఆ సిఐ పై ఇంటెలిజెన్స్ ఆరా...?- news10.app

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here