లాక్ డౌన్ సడలించడం అంతా ఆషామాషీ కాదు

కరోన విజృంభిస్తున్న తరుణం లో లాక్ డౌన్ ను సడలించడం అంతా ఆషామాషీ కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ ను ఎత్తి వేస్తే ప్రజలు గుంపులు ,గుంపులుగా బయటకు వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

అమెరికాకు చెందిన ఓ సంస్థ భారత్ లాంటి దేశానికి జూన్ 3 వరకు లాక్ డౌన్ ఉండాలని అభిప్రాయ పడిందన్నారు. తాను ప్రధాని మోడీతో మాట్లాడినపుడు లాక్ డౌన్ ఇప్పటికిప్పుడే ఎత్తి వేయాల్సిన అవసరం లేదని తన అభిప్రాయాన్ని తెలిపానన్నారు. కరోన నేపథ్యంలో తమ సేవలను అందిస్తున్న వైద్య సిబ్బందికి చేతులెత్తి నమస్కరిస్తున్నానని కేసిఆర్ అన్నారు.