వరంగల్ లో టెలీ మెడిసిన్

వరంగల్ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం లో టెలీ మెడిసిన్ కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లలిత దేవి ప్రారంభించారు.

వరంగల్ లో టెలీ మెడిసిన్- news10.app
కొవిడ్ 19 సందర్భంగా క్వారెంటేయిన్ లో ఉన్నవారికి ఇతరులకు అవగాహన, ప్రాథమిక చికిత్స కోసం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాల మేరకు టెలీ మెడిసిన్ బుధవారం ఉదయం సేవలు ప్రారంభించారు ఉదయం 10గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు అందుబాటులో ఉంటుందని డీ ఏం అండ్ హెచ్ ఓ తెలిపారు మానసిక వైద్యుడు తో పాటుగా జనరల్ ఫీజిషియన్ వైద్యుడు కూడా ఉంటారు ఎవ్వరైనా ఆరోగ్య సమస్యలు ఉన్న పక్షం ఏర్పాటు చేసిన మొబైల్ నంబర్లకు ఫోన్ చేయవచ్చును అంతె కాకుండా వాట్స్ అప్ ద్వారా గానీ వీడియో కాల్ కూడా చేయవచ్చునని ఆమె తెలిపారు డీ ఏం.హెచ్ ఓ కార్యాలయం ఈ నంబర్లను ఏర్పాటు చేశారు 7993969104,7995118405 , వాట్స్ అప్ ద్వారా వీడియో ద్వారా 93924693440 నంబర్ కు ఫోన్ చేసి ఆరోగ్య సమస్యలను నివృత్తి చేసుకోవచ్చునని డాక్టర్ లలిత దేవి తెలిపారు  ప్రజల కోసం ఏర్పాటు చేసిన టెలీ మెడిసిన్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు. ఈ ప్రారంభ కార్యక్రంలో జిల్లా సర్వే లెన్స్ అధికారి డాక్టర్ శ్రీకృష్ణ రావు మాస్ మీడియా అధికారి అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here