గ్రామ మహిళ సమాఖ్య దయా గుణం

కరోనా వ్యాధి నివారణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు మేము సైతమంటూ గ్రామ మహిళా సమాఖ్య సంఘ మహిళలు ముందుకొచ్చారని చిన్నకోడూర్ మండలంలోని మైలారం, గోనెపల్లి, ఇబ్రహీంనగర్ గ్రామైక్య మహిళా సంఘ సమాఖ్య మహిళా ప్రతినిధులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అభినందించారు. ఈ మేరకు తమ వంతు సాయంగా సీఏం సహాయ నిధికి విరాళంగా రూ.10వేల రూపాయల చెక్కును మంత్రి స్వీకరించారు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలంలోని చిన్నకోడూర్, మైలారం, ఇబ్రహీంనగర్, గోనేపల్లి గ్రామాల్లో బుధవారం మధ్యాహ్నం మంత్రి హరీశ్ రావు పర్యటించారు. ఆయా గ్రామాల్లో మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలను జెడ్పి చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం ఉన్నాయని, ప్రస్తుతం రాష్ట్రంలో 5 కోట్లన్నర గన్నీ బ్యాగులు సగం ఉన్నాయని, మిగతా సగం బ్యాగులు కోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారని వాటిని తెప్పించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి చెప్పారు.

గ్రామ మహిళ సమాఖ్య దయా గుణం- news10.app

రైతులు కూడా గతంలోని పాత గన్నీ బ్యాగులు ఉంటే తీసుకురావాలని కోరారు. ఈ ఏప్రిల్ నెలలో అకాల వర్షాలు, వడగండ్ల వానలు వచ్చే అవకాశం ఉందని, రైతులు టార్ఫలి న్ కవర్లు వెంట తెచ్చుకోవాలని సూచించారు. టార్ఫలిన్ కవర్లు లేకపోతే ఒక రైతుకు, మరో రైతు ఒకరికి ఒకరు సహకరించుకోవాలని కోరారు.

ప్రతీ పల్లె, పల్లెలో కొనుగోళ్లు కేంద్రాలు ఏర్పాటు చేసి, మీ వద్దకే వచ్చి ధాన్యం కొంటున్నామని, రైతులు కూడా ప్రభుత్వానికి సహకరించాలని., పంట కోసిన తరువాత బాగా ఆరబెట్టిన తర్వాత మీకు ఇచ్చిన టోకెన్ నెంబర్ ప్రకారం కొనుగోలు కేంద్రాలకు రావాలని రైతులను కోరారు. అన్నీ పంటలకు ప్రభుత్వం మద్దతు ధర అందించి కొనుగోళ్లు చేస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో మన దేశంలో అదుపులో ఉందని, కరోనాకు మందు లేదు. మన ఇంట్లో మనం ఉంటూ ప్రభుత్వానికి సహకరించడమే కరోనాకు మందు అంటూ రైతులకు చక్కగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట చిన్నకోడూర్ మండల ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here