నేనే కేసు పెడ్తా……?

దొంగే దొంగా దొంగా అని అరిచినట్లు ఉంది సహజీవన మోసగాడి ప్రవర్తన… ఓ ఒంటరి మహిళను సహజీవనం పేరుతో మోసం చేసి లక్షల రూపాయలు, బంగారం అంత కాజేసి అవి తిరిగి ఇవ్వాలని అడిగితే నగ్న ఫోటోలు విడియోలు నెట్ లో పెడతానని బెదిరించి ఇదిగో సాంపిల్ అంటూ భాదిత మహిళకు వాట్సాప్ చేసిన ఈ ప్రబుద్ధుడు ఇప్పుడు చిలుక పలుకులు పలుకుతున్నట్లు తెలిసింది. తప్పు తనదేం లేదని అంత ఆ మహిళదేనని తాను పోలీసులకు పిర్యాదు చేసి కేసు పెడతానని తన స్నేహితుల ద్వారా సమాచారం చేరవేసి బయపెడుతున్నట్లు తెలిసింది.

నేనే కేసు పెడ్తా......?- news10.app

పోలీస్ శాఖలో తనకు పరిచయాలు బాగానే ఉన్నాయని తానే ఆ మహిళ పై కేసు పెడతానని మరో బ్లాక్మెయిల్ కు తెరతీసినట్లు తెలియవచ్చింది. దింతో తనకు ఏ ఆసరా లేని బాధిత మహిళ ఆవేదన చెందుతుంది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న ఆ మహిళ తనకు న్యాయం చేయాలని ,సహజీవన మోసగాడి ఆగడాలనుంచి తనను కాపాడాలని పోలీసులను వేడుకుంటుంది. మరి ఈ విషయంలో పోలీసులు ఏవిదంగా సందిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here