కబ్జా చేసేయ్….బోర్డ్ పాతేయ్

వరంగల్ మహ నగరంలో కబ్జాల పర్వం కొనసాగుతోంది. పట్టా భూమి పక్కన ప్రభుత్వ భూమి కనిపించిందా.. ఇక అంతే.. యథేచ్ఛగా ఆ భూమిని తమభూమిలో కలుపుకోవడం పట్టా సర్వే నంబర్ తో రిజిస్టేషన్ చేయడం.. ఈ విధంగా నగరంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ప్రభుత్వ భూముల్ని అందిన కాడికి దండుకొని కబ్జాలకు పాల్పడుతూ రూ. కోట్లు గడిస్తున్నారు. హన్మకొండ శాయంపేట జాగీరు ప్రాంతంలో 579 సర్వే నంబర్ లో ప్రభుత్వ భూమి. సుమారు 36 ఎకరాలు కబ్జాకు గురైనట్లు తెలుస్తుంది. ఈ సర్వే నెంబర్ భట్టుపల్లి గుట్ట నుంచి హన్మకొండ జూపార్క్ వరకు ఉంటుంది….ఇందులో సుమారు 5 నుంచి 6 ఎకరాల భూమిలో పేదలు గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు..ఇది పోను మిగిలిన భూమి మొత్తంగా కబ్జాకు గురయిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రభుత్వ భూమిని 306 సర్వే నంబర్ పట్టా ఉన్న కొంతమంది వ్యక్తులు ఆక్రమించారని ఆరోపణలు వస్తున్నాయి.

కబ్జా చేసేయ్....బోర్డ్ పాతేయ్- news10.app

అలాగే 558 సర్వే నంబర్ తో పట్టా గల వ్యక్తులు సైతం కొంత భూమిని కొంత ఆక్రమించారని, ఈ వ్యక్తులే ఇక్కడి ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని జీవిస్తున్న పేదలను. “ఇది పట్టా భూమి మీరు తక్షణమే గుడిసెలు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నట్లుతెలిసింది. కాగా 2010 వ సంవత్సరంలో అప్పటి జెసి కరుణ ప్రభుత్వ భూముల హద్దులు ఏర్పాటు చేయించారు. అవి ఇప్పుడు కనిపించకుండా పోయాయని స్థానికులు చెప్పారు.కాగా ఇదే సర్వే నంబర్ లోని కందుల బండ, బొల్లం వాడ గుట్ట సైతం కబ్జారాయుళ్లు కబ్జా చేసి కనపడకుండా చేశారని ఆరోపణలు ఉన్నాయి.

కబ్జా వెనుక “గులాబీ నేత”…?

ములుగు ప్రాంతానికి చెందిన ఓ గులాబీ నేత అక్కడినుంచి వచ్చి ఈ ప్రాంతంలో మకాం వేసి వెనకాల ఉండి కబ్జా తతంగం అంతా నఫిపిస్తున్నట్లు సమాచారం. ఇక్కడి ప్రభుత్వ భూమిని కబ్జా చేసి తన సొంతం చేసుకునేందుకు విఫలయత్నం చేస్తున్నట్లు తెలిసింది.ప్రస్తుత కార్పొరేటర్, మాజి కార్పొరేటర్ సైతం ఈ ములుగు ప్రాంత గులాబీ నేతకు అన్ని విధాలుగా సహకరిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కబ్జా రాయుళ్లకు రెవెన్యూ అధికారులు సైతం సహకరిస్తున్నారని, ఇప్పటికైన రెవెన్యూ ఉన్నత అధికారులు స్పందించి ప్రభుత్వ భూముల్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here