ఆ అధికారి కాంట్రాక్టర్ అవతారం……..?

అవినీతితో కోట్ల రూపాయలకు ఎదిగిన సివిల్ సప్లై అధికారి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి…… తనశాఖలోనే ఈ అధికారి ఓ కాంట్రాక్టర్ తో కలిసి ఆ శాఖకు సంబందించిన కాంట్రాక్ట్ లు తీసుకుంటూ అనధికార కాంట్రాక్టర్ అవతారం ఎత్తి బాగానే వెనుకేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది… గతంలో వరంగల్ లో గ్రేడ్ వన్ ఉద్యోగిగా ఉన్నప్పుడు సస్పెండ్ ఐయిన ఈ అధికారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మేనేజర్ గా ప్రమోషన్ పొంది కొత్తగా జిల్లా ఏర్పాటు ఐయిన దగ్గరనుంచి అక్కడే పనిచేస్తు గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కడికి కదలకుండా అక్కడే స్థిరపడిపోయినట్లు తెలిసింది.

ఆ అధికారి కాంట్రాక్టర్ అవతారం........?- news10.app

మిల్లర్ నుండి లక్షలు వసూళ్లు?

ఆ జిల్లాకు సివిల్ సప్లై మేనేజర్ గా ఉన్న ఈ సారు మిల్లర్ లతో కుమ్మక్కై బాగానే వెనకేస్తున్నాడట. ఇటీవలే జిల్లాలోని ఓ మిల్లు యజమాని తన దగ్గర ఉన్న స్టాకు(వడ్లు)పూర్తిగా అమ్ముకున్న సమాచారం అందుకున్న ఈ అధికారి తనిఖీ పేరుతో అక్కడికి వెళ్లి పరిశీలించగా ఆ మిల్లులో స్టాకు లేదట… ఇంకేముంది సారు తన తెలివిని ఉపయోగించి ఆ మిల్లు యాజమాన్యం వద్ద 10 లక్షల రూపాయలకు పైగా వసూలు చేసినట్లు సివిల్ సప్లై ఆఫీస్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది

అనధికార కాంట్రాక్టర్?

సివిల్ సప్లై జిల్లా మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్న ఈ అధికారి గత మూడు సంవత్సరాల నుండి అనధికార కాంట్రాక్టర్ గా మారాడట. కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం మిల్లుకు తరలించే కాంట్రాక్టర్ తో చేతులు కలిపి అతగాడితో ఆ కాంట్రాక్టు లో భాగస్వామిగా చేరినట్లు సమాచారం. అంతటితో ఆగకుండా ఎం ఎల్ ఎస్ పాయింట్ స్టేజ్ 2 కాంట్రాక్టర్ తో చనువుగా ఉంటూ అధికారం అడ్డుపెట్టుకుని దానిలో కూడా వాటా పొందుతున్నట్లు ఆ కార్యాలయంలోని ఉద్యోగులే కోడై కూస్తున్నారు. ఈ సారు మీద అనుమానం రాకుండా ఈ స్టేజ్ 2 కాంట్రాక్టర్ పేరు మీదనే హన్మకొండ లోని అపార్టుమెంట్ లో రెండు ప్లాట్లు కూడా కొనుగోలు చేశాడని విశ్వసనీయ సమాచారం.

ఐటీ అధికారులు దృష్టి సారించేనా?

వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఓ జిల్లాలో సివిల్ సప్లై మేనేజర్ గా ఉన్నటువంటి ఈ సారు లెక్కకు మించి ఆస్తులను కూడబెట్టినట్లు సమాచారం హైదరాబాద్ కొత్తపేటలో, యాదాద్రి భువనగిరి జిల్లాలో, హన్మకొండ లో, పర్వతగిరి మండలం లో ఆస్తులను కొన్ని స్టేజ్ 2 కాంట్రాక్టర్ పేరుమీద మరికొన్ని ఇంకో బినామీల మీద ఉంచినట్లు విశ్వసనీయంగా తెలియవచ్చింది ఇలా అక్రమంగా లెక్కకు మించి ఆస్తులు సంపాదిస్తున్న ఈ అధికారి పై ఐటీ అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. మరి ఈ విషయంలో ఐటి అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here