అక్రమ నిర్మాణం పై మౌనమెందుకు…….?

హన్మకొండ గ్రీన్ పార్క్ హోటల్ పక్కన ఉన్న అక్రమనిర్మాణంపై టౌన్ ప్లానింగ్ అధికారులు ఎక్కడలేని అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు.అక్రమనిర్మాణంపై వివరణ అడిగితే అసహనం వ్యక్తం చేసే అధికారులు ఆ బిల్డింగ్ పై చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు.ప్రధాన రహదారిని ఆనుకొని అతి బిజీ సెంటర్ లో ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా,ఓ రెండు అంతస్తులకు అసలు అనుమతి లేకుండా…. అంతర్గత రోడ్ లకు అతిదగ్గరగా నిర్మాణం కొనసాగుతున్న అధికారుల్లో ఏమాత్రం చలనం కలగడం లేదు… నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న అధికారులు తదుపరి చర్యలకు వెనుకాడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్న వాటిని అరికట్టాల్సిన సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు నిమ్మకునీరెత్తినట్లుగా ఉంటున్నారని ప్రచారం సాగుతోంది.. ఈ ప్రచారానికి బలం చేకూర్చే విధంగా అధికారులు వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది.అక్రమ నిర్మాణాలపై ఈ విభాగంలో పని చేసే ఏ అసిస్టెంట్ సిటీ ప్లానర్ అడిగినన మాకేం తెలియదు అంతా పెద్దసారుకే తెలుసు అంటున్నారు వీరి మాటలను బట్టి అక్రమ నిర్మాణాలు సిటీ ప్లానర్ కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది .కార్పొరేషన్ లో అంత భాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారి ఎందుకు నోరు మెదపడం లేదో ఆయనగారికే తెలియాలి.

అక్రమ నిర్మాణం పై మౌనమెందుకు.......?- news10.app

ఆ బిల్డింగ్ యజమానితో కుమ్మక్కయ్యారా……..?

హన్మకొండ అదాలత్ లోని గ్రీన్ పార్క్ హోటల్ పక్కనే నిబంధనల కు విరుద్ధంగా భవనం నిర్మిస్తున్న అధికారులు లైట్ తీసుకోవడం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది ఈ అక్రమ నిర్మాణం అధికారులకు తెలిసే జరుగుతుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది… మరీ ఇంత బహిరంగంగా అక్రమ నిర్మాణం జరుగుతున్న అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్ల అధికారులు బిల్డింగ్ యజమాని తో కుమ్మక్కైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి

సిటీ ప్లానర్ కే తెలుసు అంటే ?అర్థం ఏంటి?

నగర పరిధిలో ఏ అక్రమ నిర్మాణం పై సంబంధించిన అసిస్టెంట్ సిటీ ప్లానర్ లను వివరణ కోరినా వారి నుండి ఒకే మాట బయటకొస్తుంది “అంతా పెద్దసారుకే తెలుసు”ఆ మాటకు అర్థం ఏంటో అధికారులే చెప్పాలి .దీనిని బట్టి చూస్తే సారు కు తెలిసే నగరంలో జోరుగా అక్రమనిర్మాణాలు జరుగుతున్నాయేమోనని అనుమానం కలుగుతోంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here