నాయీబ్రాహ్మనులకు నిత్యావసరాల పంపిణీ

లాక్ డాన్ కారణంగా ఈ రోజు నల్లగొండ పట్టణంలోని నిరుపేద నాయీబ్రాహ్మణ కుటుంబాలకు నాయీబ్రాహ్మణ సేవా సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు శ్రీ నేలపట్ల రమేష్ నాయీ గారి(సొంత ఖర్చుల) సహకారంతో బియ్యంతో పాటు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాప్ లా యొక్క కిరాయిల విషయంలా యజమాని ఇబ్బంది పెడితే అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. అదే విధంగా నాయీబ్రాహ్మనుల పరిస్థితి గురించి మంత్రుల సమక్షంలో చర్చించటం జరిగింది అని అన్నారు.

ఉద్యోగులు ,మేధావులు ప్రతి ఒక్కరు సహాయం చేయాలి అన్నారు అంతే కాకుండా ప్రతి ఒక్క మండలంలో ఉన్న నాయీబ్రాహ్మనూలు ముందుకు రావాలి అన్నారు.ఈ కార్యక్రమంలో గౌరవ పెద్దలు కంది సూర్యనారాయణ గారు యువజన సంఘం జిల్లా అధ్యక్షులు దుగ్యాల గణేష్ నాయీ పట్టణ అధ్యక్షులు మామిడాల లింగయ్య నాయీ గారు దుగ్యాల లక్ష్మీ నారాయణ , కంది గిరి నాయీ, ప్రవీణ్ నాయీ, నాగేల్లి మధు నాయీ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here