లండన్ లో తెలంగాణ కు చెందిన విద్యార్థి మృతి

వరంగల్ అర్బన్ జిల్లా ఐనవొలు మండలం రాంనగర్ చెందిన విద్యార్థి ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లి గుండెపోటుతో మృతి చెందాడు . గ్రామస్తుల కథనం ప్రకారం రాంనగర్ చిన్న కవిత కుమారస్వామి శారద దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్దవాడైన రంజిత్ అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా రెండోవాడైన మృతుడు సతీష్ (26)2019 జనవరిలో ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్ళాడు. కరోనా వైరస్ తో లండన్ లో భయంభయంగా ఉన్న తాము క్షేమంగానే ఉన్నామని ఆందోళన చెందవద్దని తల్లిదండ్రులకు ఫొన్ లో వివరించినట్లు తల్లిదండ్రులు వివరించారు.

లండన్ లో తెలంగాణ కు చెందిన విద్యార్థి మృతి- news10.app

స్నేహితులతో కలిసి రాత్రి భోజనం చేసి ఎవరి గదుల్లో వారు నిద్రకు ఉపక్రమిoచారు.తెల్లవారుజామున గుండెపోటుతో బెడ్ పై నుంచి కిందకి కుప్పకూలి పడిపోవడంతో శబ్దం వినిపించిది ప్రక్క గదిలో ఉన్నస్నేహితులు వెంటనే తలుపు తీయడానికి ప్రయత్నించగాలపటి నుంచి తలుపు లాక్ చేసి ఉండడంతో స్నేహితులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు వారు వచ్చి అక్కడ నుంచి ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి సతీష్ మృతి చెందినట్లు నిర్ధారించారు.

కొడుకు మృతిచెందిన విషయం తల్లిదండ్రులకు తెలియడం తో తల్లిదండ్రులు బోరునా విలపించారు. చేతికి అందివచ్చిన కుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకు రావాలని అందుకు సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ మంత్రి దయాకర్ రావు,ఎమ్మెల్యే రమేష్ చొరవ చూపాలని గ్రామస్తులు, మృతుడి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. సతీష్ మరణ వార్త తెలియగానే మృతుడు సోదరుడు దేవేందర్ తెలుసుకొని ఆదివారం సాయంత్రం మృతదేహం ఉన్న ఆసుపత్రికి వెళ్లి ఆరా తీశారు. కరోనా తో మృతిచెందలేదు కనుక మృతదేహాన్ని ఇండియా కు తీసుకు రావడానికి భారత ప్రభుత్వం కృషి చేయాలని ఫోన్ల్ తెలిపారు. తల్లిదండ్రులు కుమారుడి చివరి చూపు కోసం ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here