కరోన వేళా ప్లెక్సీ గోల……!

శాయంపేటలో రూరల్ జడ్పీ ఛైర్మన్ ను నిలదీసిన స్థానిక గులాబీ నేతలు

వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ చైర్మన్ గండ్ర జ్యోతి కి శాయంపేట మండల కేంద్రంలో చుక్కెదురైంది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రం లో కట్టిన ప్లెక్సీ వివాదానికి దారి తీసింది. ప్లెక్సీలో స్థానిక సర్పంచ్,ఎంపీటీసీ ఫోటో లేకపోవడం వివాదానికి కారణమైయింది. ప్లెక్సీలో తన ఫోటో ఎందుకు లేదని శాయంపేట సర్పంచ్ కందకట్ల రవి జడ్పి చైర్ పర్సన్ గండ్ర జ్యోతిని నిలదీశారు. మండల పార్టీలో గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. దింతో ఖంగు తిన్న జ్యోతి పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ముగించుకొని వెళ్లిపోయారు.