ఎస్ ఐ పై చర్యలకు పట్టుబడుతున్న అటవీ అధికారులు

అధికారినని చెప్పిన కనీస అవగాహన లేకుండా అటవీశాఖ అధికారిని ఇష్టారీతిన చితక బాదిన మహాదేవపూర్ ఎస్సై పై చర్యలకు అటవీ అధికారులు పట్టుబడుతున్నారు. ఎస్సై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్నేహాభావం లేని మహాదేవపూర్ ఎస్ ఐ పై చర్యలు తీసుకోవాలంటూ మహాదేవపూర్, పలిమెల అటవీశాఖ అధికారులతో పాటు సిబ్బంది ఆదివారం భూపాల పల్లి జిల్లా ఏ ఎస్ పి శ్రీనివాసులు కి కాటారం డి,ఎస్,పి,కార్యాలయంలో పిర్యాదు చేశారు.

ఎస్ ఐ పై చర్యలకు పట్టుబడుతున్న అటవీ అధికారులు- news10.app

శుక్రవారం రాత్రి పలిమెల రేంజ్ పరిధిలోని నీలంపల్లి బిట్ అటవీ ప్రాంతంలో మంటలు భారీగా చెలరేగుతున్నాయి అని దానితో మంటల్లో అటవీ సంపద కాలిపోతుందని సమాచారం అందుకున్న బిట్ అధికారి దిలీప్ సంఘటన స్థలానికి వెళ్ళడానికి సురారం గ్రామంలో ని తాను నివాసం ఉంటున్న ఇంటి ముందు ఇంకో బిట్ అధికారి కోసం వేచిచూస్తున్న సమయంలో మహాదేవపూర్ ఎస్ ఐ ద్విచక్రవాహనంపై వచ్చి బూతులు తిడుతూ చితకబాదారు. నేను అటవీశాఖ బీట్ అధికారిని అంటూ చెప్పినా వినిపించుకోకుండా చితకబాదిన ఎస్ ఐ పై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేసినట్లుగా అటవీశాఖ అధికారులు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు ప్రజలతో స్నేహాభావం తో మెదలాలని ఎన్నో మార్లు ప్రకటించినా ఈ ఎస్, ఐ, అలా మెదలలేదని గతంలో కూడా అటవీశాఖ అధికారుల ద్విచక్ర వాహనాలను ఆపి వాహనాలను పోలీస్ స్టేషన్లలో పెట్టారని ,అదేకాక మహాదేవపూర్ రేంజ్ అధికారి జీపు ను సైతం ఆపి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు మండలానికి చెందిన ఓ దళిత నాయకుడు సోషల్ మీడియాలో మహాదేవపూర్ ఎస్ ఐ కి దళితులే టార్గెట్ అంటూ వాట్సాప్ గ్రూపులలో పోస్ట్ చేయడం ,అందులో ఓ గ్రామనికి చెందిన దళితుడు ఆ గ్రామ సర్పంచ్ కి మా వాడలో త్రాగు నీరు రావడంలేదని చెప్పడంతో సర్పంచ్ ఎస్ ఐ కి పోన్ చేయడంతో ఎస్,ఐ కానిస్టేబుల్ లను పంపి ఆ దళితున్ని సర్పంచ్ ముందు కొట్టించాడని దీని పై కటారం డి ఎస్ పి కి పిర్యాదు చేసినట్లుగా సోషల్ మీడియాలో పెట్టడం గమనార్హం.?

ఎస్ ఐ తీరుపై ఏ.ఎస్.పీ. ఆరా..?

మహాదేవపూర్ ఎస్ ఐ పై అటవీశాఖ అధికారులు పిర్యాదు చేయడంతో భూపాల పల్లి ఏ,ఎస్,పీ, శ్రీనివాసులు ఎస్,ఐ, తీరుపై అరా తీస్తున్నట్లు సమాచారం. ఆదివారం మహాదేవపూర్ పోలీస్ స్టేషన్ లో ఆకస్మిక తనిఖీ నిర్వహించి సురారం గ్రామంలో బీట్ అధికారి నివాసం ఉంటున్న స్థలానికి వెళ్లి బీట్ అధికారి,ఎస్,ఐ ల మధ్య ఏమి జరిగింది అనే విషయం పై అరా తీసినట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here