మే 7 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్

మే 7 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆదివారం నిర్వహించిన మంత్రివర్గ సమావెశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన మీడియా సమావేశంలో వివరించారు. ఏప్రిల్ 20 తర్వాత రాష్ట్రంలో లాక్ డౌన్ లో ఎలాంటి సడలింపులు ఉండవని అన్నారు.

మే5 న తిరిగి నిర్వహించబోయే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకొని ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో ఫుడ్ డెలివరీని నిలిపివేస్తున్నామని స్విగ్గి ,జోమాటోలు ఇకపై ఫుడ్ సప్లై చేయకుడదన్నారు. రాబోయే 15 రోజులు ప్రజలెవరు బయటి ఆహార పదార్థాల జోలికి పోకూడదని విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ కారణంగా కిరాయి దారులు అద్దె చెల్లించే స్థితిలో లేనందున యజమానులు కిరాయి చెల్లించమని ఒత్తిడి తేవద్దన్నారు. అలా చేస్తే చర్యలు తీసుకుంటామని అలా ఎవరైనా చేస్తే 100 కు డయల్ చేసి పిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఈ విషయమై ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేస్తుందన్నారు. ప్రైవేట్ పాఠశాలలు పిజులు పెంచితే చర్యలు తప్పవన్నారు. నెల వారీగా ట్యూషన్ పిజులు మాత్రమే తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో 858 పాజిటివ్ కేసులు ఉన్నాయని రాష్ట్రంలో నాలుగు జిలాల్లో ఎలాంటి పాజిటివ్ కేసులు లేవని సీఎం తెలిపారు.