స్వీయ నియంత్రణతోనే కరోనా కట్టడి:కేయూసీ సీఐ డేవిడ్‌రాజు

ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ, సామాజిక దూరంతోనే కరోనా మహమ్మారిని కట్టడి చేయవచ్చని కేయూసీ పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌ డేవిడ్‌రాజు అన్నారు. బీమారం 46వ డివిజన్‌కు చెందిన రిటైర్డ్‌ బ్యాంకు అధికారి బైరి వెంకట్రాజం సమకూర్చిన నిత్యావసర వస్తువులను ఆదివారం హన్మకొండ జర్నలిస్టుల పరపతి సంఘం సభ్యులకు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తుగా తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో తీవ్ర స్తాయిలో వ్యాప్తి చెందలేదన్నారు. అయినప్పటికి ప్రతి ఒక్కరు మాస్కులను ధరించి పోలీసులకు, జిల్లా పాలనాయంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు.


రిటైర్డ్‌ బ్యాంకు అధికారి వెంకట్రాజం మాట్లాడుతూ కరోనా మహమ్మారి నియంత్రణకు కోసం పీఎం కేర్స్‌కు రూ.25వేలు, సీఎం సహాయ నిధికి రూ.25వేలు విరాళంగా అందించినట్లు తెలిపారు. లాక్‌డౌన్‌లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు, వైద్య, పారిశుద్య, రెవెన్యూ సిబ్బందితో పాటు నిత్యం ప్రజలకు సమాచారాన్ని అందిస్తున్న ప్రింటు, ఎలక్ట్రానిక్‌ జర్నలిస్టుల సేవలు అభినందనీయమన్నారు. ఈకార్యక్రమంలో జర్నలిస్టుల పరపతి సంఘం అధ్యక్షుడు అలువాల సదాశివుడు, ప్రధాన కార్యదర్శి నాయకపు సుభాష్,కోశాధికారి కంకణాల సంతోష్, సహయ కార్యదర్శి సాయిప్రదీప్, సహాయ కోశాధికారి సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు ఎన్‌. బుచ్చిరెడ్డి, కొల్ల కృష్ణకుమార్‌రెడ్డి, గోకారపు శ్యామ్‌ కుమార్, వలిశెట్టి సుధాకర్, సభ్యులు పాల్గొన్నారు.