అటవీ అధికారిని చితకబాదిన ఎస్సై

అటవీప్రాంతంలో పెట్రోలింగ్ కోసం వెళ్ళడానికి రహదారిపై నిల్చున్న అటవీ అధికారిని ఎస్సై చితక బాదాడు. తాను అటవీ అధికారినని చెప్పిన వినకుండా ఇష్టారీతిన చితకబాదారు. వివరాల్లోకి వెళ్తే మహాదేవ్ పూర్ మండలం నీలంపూర్ ఎఫ్ బీ ఓ గా పనిచేస్తున్న దిలీప్ కుమార్ కు శుక్రవారం రాత్రి అడవిలో అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన తాను అడవిలోకి వెళ్లేందుకు బయలుదేరుతు మరో ఎఫ్ బీ ఓ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ లోపు తన సిబ్బందితో అటు వైపుగా వచ్చిన మహాదేవపూర్ ఎస్సై బెల్లం సత్యనారాయణ రోడ్డు పై ఎందుకు ఉన్నావంటు చితకబాదడం మొదలు పెట్టాడు. తాను అటవీ అధికారినని చెప్పిన వినకుండా నానా బూతులు తిడుతూ ఇష్టం వచ్చినట్లు కొట్టాడు.

ఎస్సై పై ఫిర్యాదు

అటవీ అధికారిని ఇష్టారీతిన మహాదేవపూర్ ఎస్సై చితకబాదిన ఘటనపై అటవీ శాఖ అధికారులు సీరియస్ ఐయ్యారు. దీనికి కారణమైన ఎస్సై పై మహాదేవపూర్ సీఐ నర్సయ్య కు లిఖితపూర్వకంగా పిర్యాదు చేశారు.