బియ్యం కావాలంటే….సర్ఫ్ కొనాల్సిందే

  • పాత ముగ్దుమ్ పురం లో రేషన్ డీలర్ వింత మెలిక
  • కొనకుంటే బియ్యం కట్… రేషన్ కార్డు తిరిగి ఇచ్చేది లేదు
  • ఆవేదన వ్యక్తం చేస్తున్నా ప్రజలు
  • అధికారులు చర్యలు తిసుకోవాలని వినతి

చెన్నారావు పేట మండలం పాత ముగ్దుమ్ పురం గ్రామంలో ప్రజల ఓపికను పరిక్షిస్తున్నారు ఆగ్రామం లోని రేషన్ డీలర్లు.కరోన మహమ్మారి మూలంగా దేశవ్యాప్త లాక్ డౌన్ తో ప్రజలు ఇంటికే పరిమితం కాగా,కూలి నాలి చేసుకొని జీవించే పేద ప్రజలకు కష్టం అవుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా 12 కిలోల బియ్యం అందించాలని నిర్ణయించాయి.ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం మొదలయింది.చాలామంది రేషన్ డీలర్లు ఈ బియ్యాన్ని సక్రమంగానే పంపిణీ చేస్తుంటే పాత ముగ్దుమ్ పురం లోని రేషన్ డీలర్లు మాత్రం తమ వక్ర, కక్కుర్తి బుద్దిని బయట పెట్టు కున్నారు 50 రూపాయలు చెల్లించి కిలో సర్ఫ్ ప్యాకెట్ కొంటె తప్ప 12 కిలోల బియ్యం ఇచ్చేది లేదని మెలిక పెట్టారు.

బియ్యం కావాలంటే....సర్ఫ్ కొనాల్సిందే- news10.app

అసలే పని లేక దమ్మిడీ సంపాదన లేక లాక్ డౌన్ తో ఇంటికే పరిమితం అయిన ప్రజలు డీలర్ల కక్కుర్తి మూలంగా లబో..దిబో మంటున్నారు 50 రూపాయలు ఎలాతెచ్చెదని ప్రశ్నిస్తున్నారు.కొంతమంది విది లేక సర్ఫ్ కొనుగోలు చేస్తున్నారు.రేషన్ కార్డు డీలర్ చేతికి అందివ్వగానే సర్ఫ్ కొనాలని చెప్తున్నారట డబ్బులు లేవు కొనలేము అవసరం లేదు అంటే కార్డు డీలర్ దగ్గరే ఉంచుకొని బియ్యం లేవు ఏమి లేవు వెళ్ళమని బెదిరుస్తున్నట్లు తెలిసింది. దీనితో చేతిలో చిల్లి గవ్వ లేక సర్ఫ్ కొనలేక డీలర్ బియ్యం ఇవ్వకపోవడంతో గ్రామం లోని పేదలు ఉత్తి చేతులతోనే వెళ్లి పోతున్నారట.ఈవిషయం మై ఇప్పటి వరకు ఏ అధికారి చర్య తీసుకొనట్లు తెలిసింది.కొంతమంది యువకులు డీలర్ కక్కుర్తి పై అధికారులకు సమాచారం అందించామని చెపుతున్నారు.అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here