నమ్మక ద్రోహి…!

నాటకాన్ని బాగా రక్తి కట్టిస్తాడు

ఆస్కార్ అవార్డును మించిన నటన చేస్తాడు

నీ కుటుంబంతో బంధం పెనవేసుకున్నట్లు నంగ నాచి కబుర్లు చెప్తాడు

కపట ప్రేమను ఒలకబోస్తూ అవసరాలు తీర్చుకుంటాడు

నోటితో మాట్లాడుతూనే నొసటితో వెక్కిరిస్తాడు

అవసరం తీరాక తుర్రు మని జారుకుంటాడు

చెప్పిన మాటలన్నీ తూచ్ …అంటాడు
మాట మాత్రమైన చెప్పకుండా మొహం చాటేస్తాడు

అవును నిజం నమ్మక ద్రోహి కి చేసిన సాయం గోడకు వేసిన సున్నం లాంటిది
శవానికి చేసిన అలంకరణ లాంటిది

శత్రువు తోనైన మిత్రుత్వం కలపొచ్చు కానీ…నమ్మక ద్రోహి తో జాగ్రత్త సుమీ…!