న్యూస్10 కథనానికి స్పందన – రేషన్ షాప్ సీజ్

కరోన నేపద్యంలో కేంద్రప్రభుత్వం ప్రజలకు ఉచితంగా అందిస్తున్న 12 కిలోల బియ్యం కిలో సర్ఫ్ కొంటేనే ఇస్తామంటూ మెలిక పెట్టిన డీలర్ కు చెక్ పెట్టారు రెవెన్యూ అధికారులు.డీలర్ కక్కుర్తిపై బియ్యం కావాలంటే…సర్ఫ్ కొనాల్సిందే అనే శీర్షికన న్యూస్10 వెబ్ పోర్టల్ లో కథనం వెలువడింది .ఈ కథనానికి స్పందించిన రెవెన్యూ అధికారులు వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత ఆదేశాల మేరకు రేషన్ డీలర్ మనోహర్ కు సంబందించిన దుకాణాన్ని సీజ్ చేశారు.రేషన్ దుకాణాన్ని సీజ్ చేయడం పాత ముగ్దుమ్ పురం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read article: బియ్యం కావాలంటే….సర్ఫ్ కొనాల్సిందే