బియ్యం ఇవ్వకుంటే…. చస్తార..?

ప్రభుత్వం ,అధికారులు ఎంతగా చెప్పిన రేషన్ డీలర్లు మాత్రం వినేటట్లులేరు.వరంగల్ రూరల్ జిల్లా లో ఓ రేషన్ డీలర్ సర్ఫ్ కొంటేనే బియ్యం ఇస్తానని చెప్పగా తాజాగా వరంగల్ నగరంలోని గిర్మాజిపేటలో ఓ రేషన్ డీలర్ బియ్యం ఇవ్వకుంటే చచ్చి పోతారా …? అంటూ ప్రశ్నిస్తున్నాడు.రేషన్ కార్డు ఉంటే చాలు బియ్యం అందించండి అని ప్రభుత్వం చెపుతుంటే ఇక్కడి డీలర్ మల్లికార్జున్ మాత్రం ఆధార్ కార్డు జిరాఅక్స్ కావాలని అడుగుతున్నాడు.అదెందుకని ప్రజలు ప్రశ్నిస్తే నాన బూతులు అందుకుంటున్నాడు.దీంతో చేసేదేమీ లేక ప్రజలు బియ్యం తీసుకోకుండానే వెళ్లి పోతున్నారు.

బియ్యం ఇవ్వకుంటే.... చస్తార..?- news10.app

ఆధార్ కార్డ్ జిరాయిక్స్ తెద్దమంటే లాక్ డౌన్ కారణంగా దుకాణాలు మూసి ఉన్నాయని తాము జిరాక్స్ ఎలా తెచ్చేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ప్రభుత్యం ఓ వైపు ఎలాంటి ఆంక్షలు లేకుండా బియ్యం ఇవ్వండని ఆదేశాలు జారీ చేసిన ఈ డీలర్ మాత్రం అవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నాడని ప్రజలు ఆరోపిస్తున్నారు.బియ్యం ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న డీలర్ పై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here