స్వీయ నిర్బంధమే కరోనా నివారణకు మార్గం – వరంగల్ పోలీస్ కమిషనర్ డా. వి. రవీందర్

ప్రజలు స్వీయ నిర్బంధంలో వుంటే కరోనాను నియంత్రించగలమని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా వ్యాధి అనుమానుతుల ప్రాంతాలను వరంగల్ పోలీస్ కమిషనర్ వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, మున్సిఫల్ కమిషనర్ పమేలా సత్పతితో కల్సి క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ప్రజలు రొడ్లపైకి రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత పోలీసు అధికారులకు పలు సూచనలు చేయడంతో పాటు లాక్ డౌన్ ను అతిక్రమించి అనవసరంగా రోడ్లపైకి వాహనాలను కట్టడి చేయడంతో పాటు అవసరం అనుకుంటే వాహనాలను సీజ్ చేయాలని తెలిపారు. ప్రజలు ప్రభుత్వం సూచించిన సూచనలను పాటిస్తూ కరోనా వ్యాధిని తరిమివెద్దామని పోలీస్ కమిషనర్ తెలిపారు.