జర్నలిస్ట్ ల దాతృత్వం…. అన్నదానం

అన్నదానం ను ఛాలెంజ్ గా స్వీకరించండి

సామాజిక బాధ్యత తో పాటు సామాజిక సేవలో తమవంతు పాత్ర ను పోషిస్తున్నారు మహాదేవపూర్ జర్నలిస్టులు. లాక్ డౌన్ నేపధ్యంలో ఎలాంటి పనులు లేక బాధలు పడుతున్న పేదలకు తమకు ఉన్నంతలో అన్నదానం చేశారు. అంతేకాదు తమలా అందరూ బీదల ఆకలి తీర్చేందుకు ముందుకు రావాలని అన్నదానం చేయాలని అన్నదానం ఛాలెంజ్ విసిరారు. జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయితీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ శ్రీపతిబాపు ఆధ్వర్యంలో జర్నలిస్టులు నజీర్, చీర్లవంచ రమేష్, ఆన్కరి అనీల్,ఐతరాజిరెడ్డి,వెన్నపురెడ్డి రఘునాధ్ రెడ్డి(దేవేందర్) లు నిరుపేదలకు అన్నదానం చేశారు. తహశీల్దార్ మల్లయ్య,ఎస్ ఐ బెల్లం సత్యనారాయణ పంచాయితీ అన్నదాన కేంద్రం ను సందర్శించి వడ్డన సేవలు అందించారు..నిరుపేదలకు భోజనం పార్శల్ లను అందజేశారు.

జర్నలిస్ట్ ల దాతృత్వం.... అన్నదానం- news10.app

సమాజ కళ్యాణానికి.. దాతృత్వం ఓ మార్గం అని,ప్రజల భాగస్వామ్యంతో నిరుపేదలకు విస్తృతంగా సేవలు అందించవచ్చని.. తోటి వారి పట్ల దయ, జాలి కరుణ చూపాలని జర్నలిస్టులు అన్నదానంతో చాటిచెప్పారని ఎస్ ఐ బెల్లం సత్యనారాయణ అన్నారు.. గ్రామ పంచాయతీలో సర్పంచ్ శ్రీపతిబాపు సేవలు అభినందనీయం అని, అన్నదానం.. మహదానం లాంటిదని, ఇటువంటి విపత్కర సమయంలో అన్నదానంను ఛాలెంజ్ గా స్వీకరించాలని, అన్నదానం చేయడం సమాజ కర్తవ్యంగా భావించాలని తహశీల్దార్ మల్లయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కడార్ల శంకర్,స్ట్రీట్ లైట్స్ స్థాయి సంఘం కన్వీనర్ కేసర్ సింగ్,నాయకులు కారెంగుల బాపు రావులతో పాటు పలువురు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here