జిల్లాల్లో పర్యటించండి: కేసీఆర్

కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో స్వయంగా పరిశీలించడానికి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు జిల్లాల్లో పర్యటించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంత కుమారి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించారు.

జిల్లాల్లో పర్యటించండి: కేసీఆర్- news10.app

ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని సమావేశంలో నిర్ణయించారు. సిఎం ఆదేశం మేరకు సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంత కుమారి, మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ బుధవారం సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here