విధి నిర్వహణలో జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలి టీజీఓఏ నాయకులు

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న ఈతరుణంలో విధి నిర్వహణల్లో ఉన్న ప్రతి జర్నలిస్టు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ గెజిటెడ్ అసోసియేషన్ నాయకులు అన్నమనేని జగన్మోహన్‌రావు, కోల రాజేష్ కుమార్ లు అన్నారు. ఆయన బుధవారం హన్మకొండలోని రెవెన్యూ గెస్ట్‌హౌస్‌లో హన్మకొండ జర్నలిస్టుల పరపతి సంఘం సభ్యులకు సానిటైజర్లు, మాస్కులు, పండ్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌ వ్యాప్తి తుది దళలో ఉన్నందున ప్రతి ఒక్కరు సీయ నియంత్రణ, సామాజిక దూరం పాటించాలన్నారు.

కరోనా సమాచారాన్ని ప్రజలకు నిత్యం అందజేస్తూ అప్రమత్తం చేయడంలో మీడియా పాత్ర గణనీయమైందన్నారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి ధరించి పోలీసులకు, జిల్లా పాలనాయంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు. తెలంగాణ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు, చిదురాల సుధాకర్, వాకర్స్‌ అసోసియేషన్‌ నాయకులు తడక కుమారస్వామిగౌడ్‌లు సంయుక్తంగా జర్నలిస్టులకు మాస్కులు, సానిటైజర్లను అందించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కరోనాతో అమలవుతున్న లాక్‌డౌన్‌లో జర్నలిస్టుల సేవలు మరవలేనివన్నారు.

ఈకార్యక్రమంలో టీజీఓఎ నాయకులు రత్నవీరాచారి, హసనోద్దిన్, కంచ వేణు, అమ్జద్అలీ, హన్మకొండ జర్నలిస్టుల పరపతి సంఘం అధ్యక్షుడు అలువాల సదాశివుడు, ప్రధాన కార్యదర్శి నాయకపు సుభాష్, కోశాధికారి కంకణాల సంతోష్, సహయ కార్యదర్శి సాయిప్రదీప్, సహాయ కోశాధికారి సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు ఎన్‌. బుచ్చిరెడ్డి, కొల్ల కష్ణకుమార్‌రెడ్డి, గోకారపు శ్యామ్‌ కుమార్, వలిశెట్టి సుధాకర్, సభ్యులు పాల్గొన్నారు.