చెట్టుకు ఉరి వేసుకున్న కానిస్టేబుల్

ఏమైందో ఏమో తెలియదు అప్పటి దాకా విధులు నిర్వహించిన కానిస్టేబుల్ విగత జీవిగా మారిపోయాడు. తాను విధులు నిర్వహిస్తున్న చోటనే ఉరి వేసుకొని ప్రాణం తీసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న వడ్లకొండ ఉపేందర్ (46) పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కంట్రోల్ రూమ్ వద్ద చెట్టుకు కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతని స్వగ్రామం తొర్రూర్ మండలం చింతలపల్లి. కానిస్టేబుల్ ఆత్మహత్యకు కారణాలేంటో ఇంకా తెలియరాలేదు. విధులు నిర్వహిస్తున్న చోటనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసుల్లో విషాదం నెలకొంది.