జనమే కూల్చాలి….!

ఒక్క సీటు కోసం జరుగుతుంది ఓట్ల సమరం!
ఎవరి లెక్కలు వారే వేసుకుంటున్నాయి పార్టీలు సమస్తం…!

సాగర మథనంలో గెలిచేది ఎవరు..?
మరోసారి ప్రజలకు మాటలు చెప్పి అధిక ఓట్లు చిలికేది ఎవరు….?

సీటు కోసమే కదా అన్ని పార్టీల పాట్లు…!
జనానికి చేసిన వాగ్దానాలు నిత్యం పొడవడమే తూట్లు!

తెలివిగా వ్యవహరించాలోయ్…సాగర్ ఓటర్లు
ఎవరిక జనపక్షమో తేల్చాలి …!
జనం బాధలు తీర్చని పార్టీలను కూల్చాలి..!