ఉమ్మి వేసిన వ్యక్తిపై కేసు నమోదు

కరోనా మహమ్మారి ప్రపంచాన్నే వణికిస్తున్న నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి వేయడం నిషేధించింది.ఇకనుంచి బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి వేస్తే కేసులు నమోదు చేయాలని జీవో జారీ చేసింది.దీంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలిసారిగా బహిరంగ ప్రదేశంలో ఉమ్మి వేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.కమిషనరేట్ పరిధిలో వరంగల్ రూరల్ జిల్లా దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదు అయ్యింది .మండలం లోని ఊరు గొండ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఖిల వరంగల్ ప్రాంతానికి చెందిన కొప్పుల మొగిలి బహిరంగ ప్రదేశంలో ఉమ్మి వేశాడు.ఇది గమనించిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.