పోలీస్ స్టేషన్ నుంచి దొంగ పరార్…?

  • వరంగల్ నగరంలోని ఓ పోలీస్ స్టేషన్ నుంచి పరార్
  • పోతూ పోతూ పోలీసుల ఫోన్లు పర్స్ లు కొట్టేసిన దొంగ…?

వరంగల్ నగరంలోని ఓ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసుల కళ్ళు గప్పి అర్ధరాత్రి ఓ దొంగ పారిపోయాడు. పోతూ పోతూ స్టేషన్ లో ఎస్కార్ట్ గా ఉన్న పోలీసుల సెల్ ఫోన్ లు, పర్స్ లు ఎత్తుకొని ఉడాయించాడు.

పోలీస్ స్టేషన్ నుంచి దొంగ పరార్...?- news10.app

వరంగల్ నగరంలో నెల రోజుల క్రితం ఓ షాపులో 5 లక్షల దొంగతనం జరగగా ఈ కేసులో సీసీఎస్ పోలీసులు నిందితుడిని రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని వరంగల్ లోని సంబంధిత పోలీసు స్టేషన్లో అప్పగించారట. కానీ పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఆ దొంగ స్టేషన్ నుండి తప్పించుకొని పారిపోయినట్లు సమాచారం. పైగా వెళ్తూ వెళ్తూ అతనికి ఎస్కార్డ్ గా ఉన్న ఇద్దరు కానిస్టేబుల్ ల పర్స్ లు సెల్ ఫోన్ లను కూడా పట్టుకెళ్లాడని విశ్వసనీయ సమాచారం .కాగా ఆ నిందితుడు ఎలా తప్పించుకున్నాడో సీసీ ఫుటేజ్ లో చూద్దామనుకున్న పోలీస్ ఆధికారులకు గట్టి షాక్ తగిలిందట… గత రాత్రి ఎస్కార్ట్ గా ఉన్న ఆ కానిస్టేబుల్ లు పడుకునేముందు స్టేషన్ లోని లైట్స్ ఆఫ్ చేసి పడుకోగా సి సి పూటేజ్ ఏది రికార్డ్ కాలేదని తెలిసింది. దింతో ఈ విషయంలో ఉన్నతాధికారులకు ఎలా సమాధానం చెప్పాలో తెలియక పోలీసులు సతమతం అవుతున్నట్లు తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here