గురుకుల విద్యార్థి మృతి చెందిన సోయిలేదు ప్రిన్సిపాల్, ఆర్సీఓ నిర్లక్ష్యం…?

కబడ్డీ ఆడుతూ గాయపడి విద్యార్థి ప్రాణం పోయిన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కు గాని ఆర్ సి ఓ కు గాని కనీస సోయి లేకుండా పోయింది. పాఠశాలలో అసలు ఏం జరుగుతుందో తెలిసుకోలేని స్థితిలో వారు ఉన్నారు.విద్యార్థి మరణించి పది రోజులు గడుస్తున్నా ఉన్నతాధికారుల దృష్టికి పోకుండా కనీసం ఈ ఘటనపై ఓ నివేదిక కూడా సమర్పించకుండా ఆ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, ఆర్సీఓ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు.ప్రాణం పోయిన వీరికి కనీసం లెక్క లేకుండా పోయిందని విమర్శలు వస్తున్నాయి. హసన్ పర్తి మండలం జయగిరి మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల లో కబడ్డీ ఆడుతూ విద్యార్థి మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.ఈ నెల 8 న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థి ఉడుముల సంతోష్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు.. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన ఉడుముల సంతోష్ అనే విద్యార్థి హాసన్ పర్తి మండలంలోని జయగిరి మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు..

గురుకుల విద్యార్థి మృతి చెందిన సోయిలేదు ప్రిన్సిపాల్, ఆర్సీఓ నిర్లక్ష్యం...?- news10.app

ప్రతి సాయంకాలం లాగే నిర్వహించిన కబడ్డీ పోటీలలో ఆడుతూ తోటి విద్యార్థులు బలంగా పట్టుకోవడంతో అపస్మారక స్థితి లోకి వెళ్ళాడు.వెంటనే అక్కడున్న ఉపాధ్యాయులు విద్యార్థి ని వరంగల్ ఎంజీఎం తరలించి అక్కడనుంచి హన్మకొండ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు…అక్కడ పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్ యశోద కు అక్కడ నుంచి కిమ్స్ కు తరలించిన విద్యార్థి ప్రాణాలు కాపాడుకోలేక పోయారు తల్లిదండ్రులు…. ఇంత జరుగుతున్న వరంగల్ ఎంజి యం లో అడ్మిట్ చేసి వెళ్లిన ఉపాధ్యాయులు ఆతర్వాత విద్యార్థిని ఏమాత్రం పట్టించుకోలేదు…విద్యార్థి మృతి చెందిన ఆ కళాశాల ప్రిన్సిపాల్ కానీ ఆర్ సి ఓ కానీ విద్యార్థి మృతిపై కనీసం ఆర కూడా తీయలేదట…విద్యార్థి మరణం అనంతరం ఉపాద్యాయులే వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి పది వేలు ఇచ్చి వచ్చారుతప్ప ప్రిన్సిపాల్ ,ఆర్ సి ఓ తమకు ఏమాత్రం పట్టనట్లే వ్యవహరించారట.

కలెక్టర్ సీరియస్…

కబడ్డీ ఆడుతూ విద్యార్థి మృతి చెందిన ఘటన పై హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సీరియస్ అయినట్లు తెలిసింది.ఈ ఘటనపై తనకు వెంటనే ఓ నివేదిక సమర్పించాలని ఆర్ సి ఓ ను ఆదేశించినట్లు తెలిసింది.అలాగే ఈ విషయంలో బాధ్యత రహితంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆర్ సి ఓ ను మందలించినట్లు తెలిసింది.ఘటన జరిగిన రోజు తాను అందుబాటులో లేనని సెలవులో ఉన్నట్లు ఆర్ సి ఓ కలెక్టర్ కు చెప్పి చేతులుదులుపుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం.మొత్తానికి ఈ ఘటనపై కలెక్టర్ సీరియస్ గానే ఉన్న ఆర్ సి ఓ,ప్రిన్సిపాల్ మాత్రం తమకేం పట్టనట్లే ఉన్నట్లు తెలిసింది.

ఆర్ సి ఓ నిర్లక్ష్యం…

విద్యార్థి మృతి చెందిన ఘటనలో కలెక్టర్ సిరియస్ గానే ఉన్న ఆర్ సి ఓ మాత్రం తన నిర్లక్ష్యాన్ని వీడడం లేదట.ఘటనపై నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించిన తాను మాత్రం ఇప్పటికి నివేదిక సమర్పించనట్లే తెలిసింది.అలాగే ఈ ఘటనలో ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం కారణంగా అతన్ని సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశిస్తే సస్పెండ్ చేసే అధికారం తనకు లేదని అది గురుకులాల కార్యదర్శికే ఉంటుందని ఆర్ సి ఓ నింపాదిగా ఉన్నాడట…ఈ విషయం కనీసం కలెక్టర్ కూడా చెప్పకుండా తనకేం సంబంధం లేనట్లు ఆర్ సి ఓ ఉంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here