గడువు ముగిసింది… సమయం ఆసన్నమైయ్యింది…

హన్మకొండ నగరం నడిబొడ్డున సుబేదారి శాంతినగర్ లో ఎలాంటి సెట్ బ్యాక్ నిబంధనలు పాటించకుండా అక్రమంగా నిర్మించిన భవనం వ్యవహారంపై మున్సిపల్ అధికారులు సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది… గత నాలుగు రోజులుగా ఈ బిల్డింగ్ అక్రమ వ్యవహారంపై న్యూస్10 వరుస కథనాలను వెలువరించగా… మున్సిపల్ అధికారులు ఆ ఆసుపత్రి యాజమాన్యానికి శనివారం నోటీసులు అందజేశారు. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని లేదంటే తామే చర్యలు తీసుకుంటామని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.దింతో అక్రమనిర్మాణంపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించి కూల్చివేతకు రంగం సిద్ధం చేసినట్లుగా సమాచారం .అత్యంత బిజీ సెంటర్లో ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా భవన యజమాని పెంట్ హౌస్ తో సహా మూడంతస్తుల భవనం నిర్మించాడు…. ఇంతటి బహిరంగంగా అక్రమ నిర్మాణం చేయగా న్యూస్10 కథనంతో అధికారులు కదిలారు.

గడువు ముగిసింది... సమయం ఆసన్నమైయ్యింది...- news10.app

కూల్చివేస్తాం…. సుష్మా, అసిస్టెంట్ సిటీ ప్లానర్

సుబేదారి శాంతినగర్ లో ఎలాంటి సెట్ బ్యాక్ నిబంధనలు పాటించకుండా అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ అంతస్తులను 48 గంటల్లో కూల్చివేయాలని లేదంటే తామే కూల్చివేయాల్సి వస్తుందని టౌన్ ప్లానింగ్ అధికారులు భవన యజమానికి నోటీసులు జారీచేశారు. తాము బిల్డింగ్ యజమానికి నోటీసులు ఇచ్చామనిఅధికారులు చెపుతున్నారు.. అయితే ఆ బిల్డింగ్ యాజమాన్యానికి ఇచ్చిన 48 గంటల గడువు మంగళవారం తో ముగుస్తుంది కనుక ఆ నిర్మాణాన్ని తాము బుధవారం కూల్చివేస్తామని అసిస్టెంట్ సిటీ ప్లానర్ సుష్మ న్యూస్10 కు తెలిపారు… అన్ని అక్రమ నిర్మాణాలపై తీసుకున్న చర్యలే ఈ నిర్మాణం పట్ల ఉంటాయని స్పష్టం చేశారు. మొత్తానికి అక్రమ నిర్మాణం పట్ల టౌన్ ప్లానింగ్ అధికారులు సీరియస్ గానే ఉన్న నిర్మాణాన్ని తొలగిస్తార… లేదా అనేది వేచిచూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here