అంతా సారుకే తెలుసు…

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న గ్రేటర్ వరంగల్ పరిధిలో అంతే వేగంగా అక్రమనిర్మాణాలు సైతం వెలుస్తున్నాయి.అనుమతులు లేకుండా కొన్ని తీసుకున్న అనుమతుల నిబంధనలకు విరుద్ధంగా కొన్ని, అధికారుల,రాజకీయ నాయకుల అండదండలతో మరికొన్ని ఇలా అక్రమ నిర్మాణాల సంఖ్య గ్రేటర్ పరిదిలో పెరిగిపోతూనేఉన్నాయి. ఇలాంటి నిర్మాణాలపై న్యూస్10 గత కొన్ని రోజులుగా వరుస కథనాలను వెలువరిస్తుంది. అక్రమ కట్టడాల గుట్టు బయట పెడుతోంది. ఐయితే అక్రమ కట్టడాల విషయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు గప్ చుప్ గా వ్యవహరిస్తున్నారు.అక్రమకట్టడాల విషయంలో సమాచారం ఇవ్వడానికి ,సమాచార సేకరణ చేసినాక కనీసం దానిపై వివరణ ఇవ్వడానికి కూడా వారు ఏమాత్రం ముందుకు రావడం లేదు.

అంతా సారుకే తెలుసు...- news10.app

ఏ కట్టడం విషయంలో వివరణ అడిగిన చూస్తాం చేస్తాం అంటున్నారు తప్ప ప్రత్యక్ష చర్యలకు మాత్రం దిగడం లేదు…ఇక ఈ విభాగం లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్లానర్ లు వారు పనిచేస్తున్న ప్రాంతం లోని అక్రమ కట్టడాల గూర్చి వివరణ అడిగిన అంతా సారుకే తెలుసు…ఆయననే అడగండి అంటూ పక్కకు తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.సారు నే అడుగుదామని న్యూస్10 ప్రతినిధి సిటీ ప్లానర్ కు ఫోన్ చేసై ఫోన్ లిఫ్ట్ చేసి సమాధానం చెప్పే స్థితిలో ఆ అధికారి లేనట్లు కనిపించింది. హన్మకొండ సుబేదారిలోని ఓ అక్రమకట్టడం కూల్చివేస్తామని 48 గంటల సమయం ఇచ్చామని చెపుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ విషయం గూర్చి ప్రస్తావిస్తే సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు.

అసిస్టెంట్ సిటీ ప్లానర్ సుష్మ ఏకంగా ఆ బిల్డింగ్ ఎందుకు కూల్చాలి అన్నట్లు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు.అక్రమకట్టడాల వ్యవహారం బయటపెడుతున్న న్యూస్ 10.ప్రతినిధిని ఆ బిల్డింగ్ వెనకాలే ఎందుకు పడుతున్నారని భవన యజమానిల అసిస్టెంట్ సిటీ ప్లానర్ ప్రశ్నించడం కొసమెరుపు..ఇంతకు ఈ అధికారులు అక్రమకట్టడాల పై చర్యలు తీసుకుంటారో లేదో తెలియదు కాని ఇదిగో అక్రమం అని వార్త రాస్తే మాత్రం చిర్రుబుర్రులాడుతున్నారు. వార్త రాయడం ఎందుకు…అన్నట్లు నిర్లక్ష్యంగా సమాదానం చెపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here