టీఆర్ఎస్ పార్టీనే బహిష్కరించారు….. మంత్రి నియోజకవర్గంలో గులాబీకి దళితవాడ షాక్

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గంలోని ఓ దళితవాడలో టిఆర్ఎస్ పార్టీని దళితులు బహిష్కరించారు. తమ భూములను గులాబీ నాయకులు కబ్జా పెడుతుంటే తామేల టీఆర్ఎస్ పార్టీ ని నమ్ముతామని ప్రశ్నిస్తున్నారు. బలవంతంగా తమ భూములను కబ్జా చేస్తున్నారని గత కొన్ని నెలలుగా తాము పోరాటం చేస్తున్న మంత్రి దయాకర్ రావు కనీసం తమను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.. వివరాల్లోకి వెళితే పాలకుర్తి మండలంలోని మంచుపప్పుల గ్రామానికి చెందిన దళితులు టిఆర్ఎస్ పార్టీని దళితవాడలో బహిష్కరించినట్లు ఇండ్ల సాధన పోరాట అధ్యక్షులు కాకర్లరమేష్ తెలిపారు.

టీఆర్ఎస్ పార్టీనే బహిష్కరించారు..... మంత్రి నియోజకవర్గంలో గులాబీకి దళితవాడ షాక్- news10.app

మంగళవారం మంచుప్పుల గ్రామంలో దళిత కుటుంబాల సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశానికి పీ వెంకన్న అధ్యక్షత వహించగా రమేష్ పాల్గొని మాట్లాడుతూ మంచుప్పుల గ్రామంలో అప్పటి ప్రభుత్వం 52 మందికి 1993లో 22వ సర్వేనెంబర్ లో దళిత నిరుపేదలకు ఇండ్లకు పట్టాలు ఇచ్చారని కానీ, గ్రామంలో అధికార పార్టీకి చెందిన వారు వారి పదవులను అడ్డంపెట్టుకుని దళితుల భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో దళితుల బ్రతుకులు బాగుపడతాయని అనుకుంటే, దళితుల భూమిని అక్రమంగా కబ్జా చేయడం బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని వారు ప్రశ్నించారు.

గత కొన్ని నెలలుగా దళితులు పోరాటాలు చేస్తున్న స్థానిక మంత్రి స్పందించక పోవడం వెనుక ఆంతర్యమేమిటని, దళితులు చేసిన నేరం మిమ్మల్నిగెలిపించడమే నా అని వారన్నారు. ఇప్పటికైనా స్థానిక మంత్రి స్పందించి దళితుల పక్షాన నిలబడి, పట్టా సర్టిఫికెట్స్ ఉన్నవారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, ఇవ్వకపోతే ఆందోళన ఉధృతం చేసి టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సోమయ్య. జి యాదగిరి. డి సోమన్న. బి సోమయ్య. భాస్కర్. ఏం యాక లక్ష్మి. జి లక్ష్మి. యాదమ్మ. సుజాత. ఈ లచ్చమ్మ. కొమరమ్మ. ఎల్లమ్మ. చంద్రమ్మ. వెంకటమ్మ . లచ్చమ్మ. వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here