rknews10
1166 POSTS
Exclusive articles:
కల్వకుంట్ల కుటుంబాన్ని పాతాళానికి తొక్కుతాం…
బీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సీఎం, "కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని రాజకీయంగా పాతాళానికి తొక్కుతాం" అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే తమ విజయానికి బలమైన పునాది అవుతాయని చెప్పారు.
కడియం దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకో…!!
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే పదవిలో ఇమడలేకపోతే దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలని, అది సాధ్యం కాకపోతే రాజకీయాలకు రాజీనామా చేసి ఇంట్లో పడుకో వాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.
“రూ.15 కోట్ల సుపారీ”.. ప్రముఖ డాక్టర్‌కు బెదిరింపులు..!
హన్మకొండకు చెందిన ప్రముఖ వైద్యుడిని హత్య చేస్తామని, తనపై రూ.15 కోట్ల సుపారీ వచ్చిందంటూ బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేయాలని కుట్ర పన్నిన ముగ్గురు నిందితులను హన్మకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా విశ్లేషణ, నిఘా ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
జూలై–సెప్టెంబర్‌లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు: టీటీడీ
తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై నుంచి సెప్టెంబర్ వరకు జరిగే పలు వార్షిక ఉత్సవాలు, ప్రత్యేక కార్యక్రమాల నేపథ్యంలో కొన్ని తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. ఈ మేరకు భక్తులు తమ యాత్రను ముందుగానే ప్రణాళికబద్ధంగా రూపొందించుకోవాలని సూచించింది.
కొండా సురేఖది అవగాహన లోపం.
"Konda Surekha lacks understanding... Is it all about controversies, ignoring development?"
Breaking
డ్వాక్రా మహిళల సొమ్ముకు రెక్కలు..?17 ఏళ్లుగా ఆ సీఏ పెత్తనం..!
మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా నిలవాల్సిన డ్వాక్రా సంఘంలోనే ‘కమీషన్’ దందా నడుస్తోందా..? బ్యాంకు నుంచి సభ్యురాలి పేరుతో రూ.లక్ష రుణం మంజూరైతే.. రూ.90 వేలు ఓ సీఏ ఖాతాలోకి మళ్లుతున్నాయా..? పని కావాలన్నా, రుణం రావాలన్నా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ముట్టజెప్పాల్సిందేనా..? శాయంపేట మండలం తహరాపూర్‌లోని మహాలక్ష్మి డ్వాక్రా సంఘాల వ్యవహారంపై వినిపిస్తున్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
కాపు ఉద్యమ నేత ఇకలేరు…
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ముద్రగడ పద్మనాభం మృతి చెందిన విషయాన్ని ఆయన కుమారుడు ముద్రగడ గిరి ప్రకటించారు.
రేవంత్ వ్యాఖ్యల రచ్చ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెస్ట్ మారేడ్‌పల్లి, జగిత్యాల పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా ఫిర్యాదులు అందజేసి, సీఎం రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
మడికొండ శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి
పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మడికొండ గ్రామ శివారులో పోలీసులు దాడి నిర్వహించారు. మడికొండ ఎస్‌ఐ రాజబాబు సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి చేసి పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.


