పారిశుద్ధ్య కార్మికురాలి పెద్ద మనస్సు

హైదరాబాద్‌: కరోనా పై పోరాటానికి పెద్ద మనసు చేసుకొని తనవంతు సాయాన్ని అందించింది పారిశుధ్య కార్మికురాలు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి అండగా నిలిచింది. తన వంతుగా సహకారం అందించింది.  అలివేలు అనే ఓ పారిశుద్ధ్య కార్మికురాలు కరోనా నియంత్రణ చర్యల నిమిత్తం తన నెల జీతం (రూ.12వేలు) నుంచి రూ.10వేలు సీఎం సహాయ నిధికి విరాళంగా ఇచ్చి గొప్ప మనసు చాటుకుంది. మంత్రి కేటీఆర్‌ను కలిసి చెక్కు అందించింది.. ఈ సందర్భంగా ఆమె పెద్ద మనసును కేటీఆర్ అభినందించారు.

పారిశుద్ధ్య కార్మికురాలి పెద్ద మనస్సు- news10.app

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here