ఇంతే కదా….?

పట్టభద్రుల మంచికి ఎవరు చేసిందేమిటి..?
ఓటు వేయలేదని తిట్టిపోస్తే తగిలేది ఎవరికి…?

నేతి బీర రాజ్యంలో ప్రజాస్వామ్యమెక్కడిది…?
ప్రశ్నించే గొంతుకలు పనిచేసేదెవ్వరికి…?

వారు పోయి వీరస్తే మారేదేమైనుందా…?
ఏ రాయి ఐతేనేమి మూతి పళ్లు రాలడానికి

బతుకులు మారేదిలేదు ఇంతే కదా…ఇప్పటికి
మాటలు వినీ వినీ అలసిపోయిన జనం మారరు ఇంకెప్పటికి