ముగిసిన కథ…!

తెలంగాణలో ముగిసిందా సైకిల్ సవారీ…?
కరడుగట్టిన తెలుగు తమ్ముళ్లు ఎక్కడున్నారు మరి…?

ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటి నాయకులు…!
పచ్చనున్న వారి పక్క చేరేటి తెలివిమంతులు…!

సైకిల్ అంటే ప్రాణమని అప్పట్లో సవాళ్లు విసిరారు…!
మాటలన్నీ నీటి మూటలుగా మార్చేసి గోడ దూకి పోయారు…

బాబు రెండు కళ్ళ సిద్ధాంతం బావురుమనిపించింది…
పచ్చ గున్న పార్టీ కాస్త తెలంగాణలో ఎండి ఎర్ర గప్పలైయింది….!