నేతి బీర గాండ్లు…!

సహాజ వనరులు ఎవడికో ధారాదత్తం చేస్తారు
పర్యవరణాన్ని కాపాడాలని పిలుపునిస్తా రు

నాయకులే కబ్జా కోరులై అడవులను ఆక్రమిస్తారు
చెట్లను కాపాడండి అంటూ ఉపన్యాసాలు…దంచుతారు

అనుచర గణాలతో వీరంగం సృష్టిస్తారు
శాంతి భద్రతలే తమ ద్యేయమని ప్రకటనలు చేస్తారు

నోటితో మాట్లాడుతారు
నొసటితో వెక్కిరిస్తారు

కడుపులో లేకున్న కావలించుకుంటారు
అవును
వాళ్ళకు ఓటే ద్యేయం
పదవే లక్ష్యం